ధమాకా చిత్రంలో శ్రీలీల ఎనర్జిటిక్ డాన్స్ లకు ఫిదా కానీ ప్రేక్షకులు లేరు. పుష్ప 2లోను శ్రీలీల కిస్సిక్ సాంగ్ లో డాన్స్ ఇరగ్గొట్టేసింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ని చూసి అలా ఇన్స్పిరేషన్ తోనే శ్రీలీల కు డాన్స్ నేర్పించినట్లుగా ఆమె తల్లి స్వర్ణలత ఓ షో లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
జీ తెలుగులో జగపతి బాబు హోస్ట్ గా వస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో కి శ్రీలీల గెస్ట్ గా వచ్చింది. ఆ షోలో శ్రీలీల చాలా సంగతులు శ్రీలీల తో పాటుగా ఆమె తల్లి స్వర్ణలత కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు. అయితే డిస్ ప్లే పై ఎన్టీఆర్ చిన్నప్పుడు కూచిపూడి డాన్స్ చేసిన ఫోటో ప్లే చెయ్యగానే నాకు అమ్మాయి పుడితే డ్యాన్స్ నేర్పించాలని నిర్ణయించుకున్న క్షణాల్ని గుర్తుచేసే ఫొటో ఇది అంటూ శ్రీలీల తల్లి స్వర్ణలత చెప్పారు.
అప్పుడు ఎన్టీఆర్ తో మాట్లాడారా అని జగపతి బాబు అడిగితే.. 1997లో లాస్ ఏంజెలెస్ లో జరిగిన తానా సభల్లో మాట్లాడా. అప్పుడు అనుకున్నట్టే శ్రీలీలకు డ్యాన్స్ నేర్పించా అంటూ ఎన్టీఆర్ డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి శ్రీలీల కు డాన్స్ నేర్పించినట్లుగా ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది.