లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంటి కోడలు కాబోతోంది సానియా చందోక్. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ని పెళ్లాడబోతోంది. ఇటీవలే ఈ జంటకు నిశ్చితార్థం అయిందని కథనాలొచ్చాయి. ముంబైలో పెట్ స్టోర్స్ సహా పలు భారీ వ్యాపారాలతో పాపులరైన ప్రముఖ వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన సానియా చందోక్ స్వయంగా పెట్ స్టోర్స్ నిర్వహణలో అనుభవం ఘడించింది. మిస్టర్ పావ్స్ పెట్ స్పా & స్టోర్ LLP మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతోంది. త్వరలో టెండూల్కర్ ఇంట కోడలుగా అడుగుపెడుతున్న ఈ భామ ఎక్కడికి వెళ్లినా కేంద్రక ఆకర్షణగా మారుతోంది.
తాజాగా సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ ముంబైలో పైలేట్స్ అకాడెమీ పేరుతో ఫిట్‌నెస్ సెంటర్ ని ప్రారంభించగా, ఈ ప్రారంభోత్సవంలో టెండూల్కర్ కుటుంబంతో పాటు సందడి చేసింది సానియా. ఈవెంట్లో సారా టెండూల్కర్ తో పాటు సానియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ ఫోటోలను సచిన్ స్వయంగా సోషల్ మీడియాల్లో షేర్ చేయగా, వేడుకలో అర్జున్ టెండూల్కర్ మిస్సింగ్! అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తల్లిదండ్రులుగా పిల్లలు ఏం చేయాలనుకుంటే దానిలో ప్రోత్సహిస్తాం.
సారా ఈరోజు పైలేట్స్ అకాడెమీ ప్రారంభించడాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇటుక ఇటుక పేర్చుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేసిందని కుమార్తెను సచిన్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఇన్ స్టాలో దాదాపు 80లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న సారా టెండూల్కర్ సామాజిక మాధ్యమాల్లో అత్యంత వేగంగా పాపులరైన సెలబ్రిటీ. ఇప్పుడు బిజినెస్ ఉమెన్ గాను సారా కెరీర్ ని నిర్మించుకుంటోంది.