ఏడాదికో లక్కీ గర్ల్ అన్నట్టుగా ఒక్కో ఏడాది టాలీవుడ్ ని పలకరిస్తున్నారు. ఈ ఏడాది వరసగా ఛాన్స్ లు పట్టుకుంటూ లక్కీ హీరోయిన్ గా మారిన పోరి భాగ్యశ్రీ బోర్సే. ఆమె నటించిన మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ అట్టర్ ప్లాప్. అయినా అమ్మడుకి వరస అవకాశాలు తలుపు తట్టాయి. ఎక్కడో సుడి ఉంది అదే ఆమెకు కలిసొస్తుంది.. అనేవాళ్ళు లేకపోలేదు.
రీసెంట్ గా కింగ్ డమ్ తో మరో షాక్ తగిలించుకున్న భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు కాంత తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ అచ్చొచ్చిన గుడి, నేను నా జర్నీ ని ఈ గుడి నుంచే స్టార్ట్ చేశాను అంటూ చక్కటి ట్రెడిషనల్ లుక్ లో ఆ గుడిలో కూర్చుని దైవభక్తితో కనిపించింది.
అది హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ఉన్న టెంపుల్.. Gods daughter 🖤 One of my most cherished places in Hyderabad! A temple where my journey began.. a place that brings me back during every step of life ✨ అంటూ ఆ ఫోటోని భాగ్యశ్రీ బోర్సే ని పోస్ట్ చేసింది.