బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా తన భార్య సునీతా తో విడిపోతున్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దానికి కారణం ఓ కుర్ర హీరోయిన్ తో గోవిందా రాసలీలలు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గతంలోనూ గోవిందా పలువురు హీరోయిన్స్(నీలం, రవీనా టాండన్‌ల) తో ఎఫ్ఫైర్ నడిపాడు, అప్పట్లో కూడా సునీత గోవిందా తో విడిపోతుంది అనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు 37 ఏళ్లుగా అన్యోన్యంగా గడిపిన ఈ జంట ఇప్పుడు మాత్రమ్ సీరియస్ గానే విడాకులకు సిద్ధమైంది అనే వార్త మాత్రం మాత్రం తెగ వైరల్ అవుతుంది.
మరాఠీ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ హీరోయిన్‌తో గోవిందా రిలేషన్‌లో ఉన్నారని.. ఆ హీరోయిన్ కారణంగానే గోవిందా ఆయన భార్య సునీత అహుజాల నడుమ గొడవలు జరుగుతున్నట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతుంది. అయితే ఈవిడాకుల వార్తలపై గోవిందా మేనేజర్ స్పందించాడు.
గోవిందా ఆయన భార్య సునీత ల నడుమ అభిప్రాయ భేదాలు ఉన్నాయని, కానీ అవి విడాకులు తీసుకునేంత పెద్దవి కావని, భార్య-భర్త లు ఇద్దరూ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని గోవిందా మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. గోవిందా మేనేజర్ మాత్రమే కాదు గోవిందా మేనకోడలు ఆర్తి సింగ్ కూడా ఈ విడాకుల వార్తలపై స్పందించారు. గోవిందా - సునీతల మధ్య విడాకుల వార్తలు అవాస్తవమని, వారిద్దరూ ఎంతో అన్యోన్నంగా ఉంటున్నారని ఆర్తిసింగ్ చెప్పుకొచ్చారు.
ఇలాంటి గాసిప్స్ వలన అభిమానులను, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మీడియాకు ఆమె విజ్ఞప్తి చేశారు.