Advertisementt

సినిమాలకు బ్రేక్-డైరెక్షన్ లోకి సామ్

Sat 23rd Aug 2025 02:01 PM
samantha  సినిమాలకు బ్రేక్-డైరెక్షన్ లోకి సామ్
Samantha Trying Her Luck In direction సినిమాలకు బ్రేక్-డైరెక్షన్ లోకి సామ్
Advertisement
Ads by CJ

సమంత రౌత్ ప్రభు ఎప్పుడు వార్తల్లో నిలిచే పేరు. ఆమె సినిమాలు ఒప్పుకోకపోయినా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడంతో, లేదంటే ఆమెపై ఏదో ఒక పుకారు షికారు చెయ్యడమో చేస్తూ ఉంటుంది. కొన్నాళ్లుగా అంటే విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత ఆమె నిర్మించిన శుభం లో గెస్ట్ పాత్ర వేసాక సమంత ఏ సినిమా ఒప్పుకోలేదు.

సినిమాలకు మాత్రమే బ్రేకిచ్చింది కానీ వెబ్ సీరీస్ లు చేస్తుంది. రీసెంట్ గా ఆమె నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ కూడా ఆగిపోయింది. అయినప్పటికి సమంత క్రేజ్ తగ్గలేదు, ఆమె ప్రస్తుతం నటనకు బ్రేకిచ్చి సినిమాలు నిర్మించడమే కాదు, మెగా ఫోన్ పట్టబోతోంది అనే వార్త వైరల్ అయ్యింది.  

సమంత దర్శకురాలిగా మారాలని నిర్ణయించుకోవడం, ఇప్పటికే ఓ కథని సిద్దం చేసుకుందని.. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ మీదికి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత తను డైరెక్ట్ చెయ్యబోయే సినిమాని సొంత బ్యానర్‌పై నిర్మించడమే కాదు, అందరూ కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని టాక్. 

Samantha Trying Her Luck In direction:

  Samantha took break for acting and Trying Her Luck In direction  

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ