ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. మెగాస్టార్ బర్త్ డే అంటే మెగా ఫ్యాన్స్ కు ఎంత సంబరాలు చేసుకుంటారో.. టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటుగా చిన్న, పెద్ద నటులు కూడా సోషల్ మీడియా వేదికగా చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ హడావిడి చేస్తుంటారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు, తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి హీరో రవితేజ వరకు అందరూ మెగాస్టార్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఎంతమంది ప్రముఖులు విషెస్ పెట్టినా అందరిలో స్పెషల్ అనిపించింది మాత్రం అల్లు అర్జున్ విషెస్.
Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets అంటూ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. గతంలో అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యామిలీతో కాస్త డిస్టెన్స్ మైంటైన్ చేసాడనే ప్రచారం జరిగింది. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ చిరుని విష్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.