కూలి చిత్రంతో ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతి హాసన్ మరో గ్లామర్ డాల్ పూజ హెగ్డే కు చెక్ పెడుతుందా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. అసలే ప్లాప్ లో ఉంది, కమ్ బ్యాక్ లోను కలిసిరావడం లేదు పూజ హెగ్డే కి. అయినప్పటికీ కోలీవుడ్ స్టార్స్ ఆమెకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.
ఇక తెలుగులోనూ ఓ లవ్ స్టోరీ తో రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా పూజ హెగ్డే ఈ మధ్యనే ఓ సినిమా ప్రమోషన్స్ లో రివీల్ చేసింది. అది మలయాళ స్టార్ హీరో దుల్కర్ చెయ్యబోయే తెలుగు సినిమాలో పూజ హెగ్డే నటిస్తుంది అనే ప్రచారం జరిగింది. ఈలోపే ఆ సినిమాలోకి శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా చెప్పి షాకిచ్చింది.
మరి శృతి హాసన్ పూజ హెగ్డే ని అనుకున్న రోల్ కి వచ్చిందా, లేదంటే దుల్కర్ తో హెగ్డే హెగ్డే, శృతి హాసన్ రొమాన్స్ చేస్తారా అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో అందరూ పూజ హెగ్డే రీ ఎంట్రీ సినిమాని శృతి హాసన్ కొట్టేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు.