మెగాస్టార్ చిరంజీవి లుక్ లో ఎలాంటి VFX లేదు.. ఆయన లుక్ అంతా ఒరిజినలే అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి ఎందుకు అలాంటి కామెంట్స్ చేసారో అనేది అందరికి ఇట్టే అర్ధమవుతుంది. ఎందుకంటే కొన్నాళ్లుగా ప్రభాస్ సినిమాల్లోనూ, అలాగే రీసెంట్ గా వచ్చిన వీరమల్లులో పవన్ లుక్, వార్ 2లో ఎన్టీఆర్ లుక్ పై ఎంతగా విమర్శలొచ్చాయో చూసాము. హీరోల లుక్స్ ని VFX తో కవర్ చేస్తున్నారంటూ ఎంత రచ్చ అయ్యిందో అందరికి తెలుసు.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఆయన బర్త్ డే సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ మూవీ గ్లింప్స్ లో మెగాస్టార్ కోట్ వేసుకుని స్టైలిష్ గా కనిపించారు. మరి 70 ఇయర్స్ ఏజ్ లో చిరు అంత స్టయిల్ గా ఉండడం చూసి అందరూ ఎక్కడ ఆయన లుక్ ను VFX చేసారు అని అనుకుంటారో ఏమో అని ముందే అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేసారు.
మెగాస్టార్ చిరంజీవి సూట్ లో ఎలా ఉంటారో చూడడం నాకు ఇష్టం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. చిరు లుక్ లో VFX ఏమి లేదు. 95 పర్సెంట్ ఒరిజినల్ అంటూ అనిల్ రావిపూడి చెప్పిన విధానంతో మెగా ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు. సో మన శంకర వరప్రసాద్ గారు అంతా ఒరిజినలే అన్నమాట.