నందమూరి నటసింహ-బోయపాటి కలయికలో నాలుగో మూవీగా తెరకెక్కుతున్న అఖండ2తాండవం చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ 25 కి సినిమా వస్తుందా, రాదా, అనే విషయంలో నందమూరి అభిమానుల్లో క్లారిటీ మిస్ అవుతుంది. అఖండ 2 లో బాలయ్య కు పవర్ ఫుల్ విలన్ గా సరైనోడు విలన్ కమ్ హీరో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు.
తాజాగా ఆదిపినిశెట్టి బాలయ్య ను పవర్ హౌస్ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాలయ్య తెరపై ఎలా కనిపిస్తారో.. ఆయన బయట కూడా అలానే ఉంటారు. బాలయ్య ఓ పవర్ హౌస్. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి. కష్టపడి పని చేస్తారు. బాలకృష్ణ గారి దగ్గరనుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. బోయపాటి దర్శకత్వంలో మ్యాజిక్ ఉంది.
బోయపాటి-బాలయ్య కలయికలో రాబోతున్న అఖండ 2 లో నేను నటించడం నిజంగా నా అదృష్టం అని చెప్పిన ఆది పినిశెట్టి విలన్ పాత్రపై కూడా రియాక్ట్ అయ్యాడు. మనలో మంచి, చెడు రెండు లక్షణాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి నెగెటివ్ గా పాజిటివ్ గా ఆలోచిస్తాం. ఎప్పుడు మంచి పాత్రలు చేస్తూ ఉంటే, ఒక సమయానికి వాటిపై ఇంట్రెస్ట్ ఉండదు.
విలన్ పాత్రలకు ఎలాంటి రెస్టిక్షన్స్ ఉండవు. ఎన్ని వేరియేషన్స్ అయినా చూపించొచ్చు. నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. విలన్ కేరెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటూ ఆది పినిశెట్టి చెప్పుకొచ్చాడు.