మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈ శుక్రవారమే. ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే. మెగా అభిమానులకు పండగ రోజు. మెగాస్టార్ చిరు బర్త్ డే అంటే ఎలా ఉంటుంది. ఆయన కొత్త సినిమాల అనౌన్సమెంట్స్, మూవీ ఓపెనింగ్స్, కొత్త సినిమాల అప్ డేట్స్ తో హడావిడిగా ఉంటుంది. మెగా ఫ్యాన్స్ కూడా ఆ అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో షేర్లు, లైక్ లు చేస్తూ హంగామా చేస్తారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కి విశ్వంభర అప్ డేట్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అనేది మాటల్లో వర్ణించలేము. కానీ మేకర్స్ మాత్రం విశ్వంభర అప్ డేట్ విషయంలో నిమ్మకు నిరేత్తినట్టు ఉన్నారు. మరో వైపు విశ్వంభర దివాళి కి రిలీజ్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది.
అదే సమయంలో విశ్వంభర సీజీ వర్క్ కంప్లీట్ అవ్వలేదు, అది ఇప్పట్లో అవ్వదు, ఈ ఏడాది విశ్వంభర వచ్చేది లేదు. వచ్చే ఏడాది జనవరిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ ఉంటుంది అంటూ షాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతికి కాకపోతే 2026 ఏప్రిల్ కి విశ్వంభర రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలు చూసి మెగా ఫ్యాన్స్ ఆందోళన అపడుతున్నారు.