తను మాంసాహారం తింటాను, మద్యం సేవిస్తాను, కామాఖ్య ఆలయంలో అమ్మవారికి మాంసాహారమే నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటాప్పుడు నేను తింటే తప్పా, అక్కడి అమ్మవారికి నేను ప్రత్యేకంగా పూజ్జలు చేస్తాను, తరచూ కామాఖ్య ఆలయానికి వెళతాను అంటూ జ్యోతిష్కుడు వేణు స్వామి పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా వేణు స్వామి కామాఖ్య ఆలయానికి వెళ్లగా ఆయన్ను గుడి లోపలికి అనుమతించకుండా అక్కడి ఆలయ పూజారులు, సిబ్బంది అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా కామాఖ్య ఆలయ అర్చకులు, పండితులు, పూజారులు, కామాఖ్య ఆలయ సిబ్బంది వేణు స్వామిపై గుర్రుగా ఉన్నారు.
అక్కడి అమ్మవారికి సమర్పించే నైవేద్యం గురించి, ఇంకా పిల్లలు లేని వాళ్ళు అమ్మవారి ఆలయ కొండపై కలిస్తే పిల్లలు పుడతారని చెప్పడం, అక్కడ వేణు స్వామి కొంతమంది దగ్గర లక్షల్లో డబ్బు తీసుకుని కామాఖ్య అమ్మవారికి పూజలు చేసిన విషయంలో వేణు స్వామిపై అక్కడి పండితులు, అర్చకులు కోపంగా ఉన్నారు.
అంతేకాకుండా వేణు స్వామిపై కేసు కూడా పెట్టేందుకు అక్కడి ఆలయ అర్చకులు, సిబ్బంది రెడీ అవుతున్నారు. గుడి అంటే గుడి లాగే ఉండాలి. కామాఖ్య అమ్మవారి గుడితో గానీ గుడిలోని పూజలతో కానీ వేణు స్వామికి ప్రత్యక్ష సంబంధం లేదు. ఆయన లక్షలు తీసుకుని పూజలు చేయిస్తూ భక్తులను మోసం చేస్తున్నాడు. ఈ విషయం గురించి కొద్ది రోజుల క్రితమే మాకు తెలిసింది. ఈ విషయంపై వేణు స్వామిపై పోలీసు కేసు కూడా పెట్టేందుకు రెడీ అవుతున్నాం అంటూ వారు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.