కుర్ర నిర్మాత, ఫైర్ మీదుండే నిర్మాత ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సూర్యదేవర నాగవంశీ. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నాగవంశీ.. తన సినిమా ఈవెంట్స్ లో చాలా కాన్ఫిడెంట్ తో అభిమానులకు మాటిస్తాడు. ఎన్టీఆర్ దేవర హక్కులు తీసుకున్న నాగవంశీ రీసెంట్ గా వార్ 2 తెలుగు హక్కులను తీసుకోవడమే కాదు ఎన్టీఆర్ అభిమానులపై కలెక్షన్స్ తెచ్చే బాధ్యత పెట్టారు.
కానీ వార్ 2 అంచనాలు అందుకోలేకపోవడంతో నాగవంశీ ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ నాగవంశీ మిస్సింగ్, వార్ 2 పై మాట్లాడకుండా సైలెంట్ అయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు, ట్రోల్స్ పై నాగవంశీ ఒక్క ట్వీట్ తో ఆన్సర్ ఇచ్చేసాడు.
Enti nannu chala miss avthunattu unnaru.. 😂
Vamsi adi, Vamsi idi ani gripping narratives tho full hadavidi nadustundi…
Parledu, X lo manchi writers unnaru.
Sorry to disappoint you all, but inka aa time raaledu… minimum inko 10-15 years undi.
At the cinemas… for the cinema, always! ♥️
See you all with our next outing #MassJathara, Very Soon!
ఎంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ ఇది, వంశీ అదీ అని ఫుల్ హడావుడి నడుస్తుంది. పర్లేదు, X లో మంచి రైటర్స్ ఉన్నారు. సారీ అందరినీ డిసప్పాయింట్ చేసినందుకు, కానీ ఇంకా ఆ టైమ్ రాలేదు. దానికి ఇంకా మినిమం 10–15 ఏళ్లు పడుతుంది. సీ యు ఆల్.. మాస్ జాతరతో కలుద్దాం.. అంటూ నాగవంశీ వేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ హాట్ గా వైరల్ అవుతోంది.