నందమూరి నట వారసుడు, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ నటుడిగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో అనే విషయంలో నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ బర్త్ డే కి ఆయన మొదటి సినిమా అప్ డేట్ వచ్చినా అది కొన్ని టెక్నీకల్ రీజన్స్ తో ఆగిపోయింది.
అప్పటినుంచి మోక్షజ్ఞ కొత్త సినిమా కబురు కోసం వెయిటింగ్. తాజాగా నారా రోహిత్ ఆయన నటించిన సుందరకాండ చిత్ర ప్రమోషన్స్ లో బాలయ్య తో మల్టీస్టారర్ పై అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై కామెంట్స్ చేసారు. మోక్షుజ్ఞ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడని, రీసెంట్ గా తను మోక్షజ్ఞ ను కలిసినప్పుడు మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు. మోక్షజ్ఞ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం వెతుకుతున్నాడు.
ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ స్టార్ట్ అవుతుంది, సినిమాల కోసమే మోక్షు లుక్ మార్చుకున్నాడు. గతంలో మోక్షజ్ఞ లుక్ కంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అని చెప్పిన నారా రోహిత్.. బాలయ్య తో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది, కథ రెడీ రెడీ అయ్యింది. నాకు ఆయనకు లుక్ టెస్ట్ కూడా చేశారు. కథ నచ్చింది. కానీ, ఆ సమయంలో ఆయనకు వరుస సినిమాలు, ఎలక్షన్స్ ఉండడంతో బాలయ్య తో సినిమా మిస్ అయ్యింది అంటూ నారా రోహిత్ చెప్పుకొచ్చారు.