సిద్దు జొన్నలగడ్డ తో కలిసి లిల్లీ కేరెక్టర్ లో టిల్లు స్క్వేర్ లో గ్లామర్ గా రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యలో డబ్బింగ్ మూవీస్ అయిన డ్రాగన్, జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు పరదా చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవడమే కాదు పరదా లుక్ లోనే ఆమె సినిమాను తెగ ప్రమోట్ చేసింది.
టిల్లు స్క్వేర్ లో లిల్లీ కేరెక్టర్ తనకే నచ్చలేదు అని, కానీ కొన్ని పాత్రలు డిమాండ్ ను బట్టి మారాల్సి ఉంటుంది అంటూ అనుపమ పరమేశ్వరన్ అభిమానులకు సర్ది చెబుతూనే పరదా ని చూడండి మీకు నచ్చినట్టు చేశాను అన్న రీతిలో చెప్పి ఫ్యాన్స్ ను శాంతపరిచింది. లేదంటే లిల్లీ కేరెక్టర్ చూసాక అనుపమను ఫ్యాన్స్ చాలా తిట్టుకున్నారు.
ఇక ఈ శుక్రవారం అంటే ఆగష్టు 22న విడుదలకు సిద్దమైన పరదా చిత్రాన్ని రెండు రోజుల ముందు నుంచే స్పెషల్ ప్రీమియర్స్ ని ప్రదర్శించబోతున్నారు. అది చూసిన ప్రేక్షకులకు పరదా చిత్రంపై మేకర్స్ కి లేదంటే లేదంటే ఓవర్ కాన్ఫిడెంటా అనేది అర్ధం కావడం లేదు. ఈరోజు బుధవారం సాయంత్రం నుంచే పరదా ప్రీమియర్స్ ని ప్రదర్శిస్తున్నారు. మరి పరదా తో అనుపమ జాతకం ఎలా ఉండబోతుందో అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.