కొద్దిరోజులుగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు, అందుకే ఆయన పబ్లిక్ లోకి రావడం లేదు, తన స్నేహితుడు కోలుకోవాలని మోహన్ లాల్ శబరిమలై ఆలయంలో ప్రత్యేకంగా పూజ్జలు చేసి విషయంలో అప్పట్లో వివాదాస్పదం అయ్యింది, మమ్ముట్టికి క్యాన్సర్ ఆయన విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
రీసెంట్ గా మమ్ముట్టి కోలుకుని షూటింగ్స్ కి రెడీ అవుతున్నారనే వార్త మలయాళ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ మోహన్ లాల్ తన స్నేహితుడితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ మమ్ముట్టి ఈజ్ బ్యాక్ అన్న విషయాన్నీ అభిమానులతో పంచుకున్నారు. దానితో ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది.
మరో నటి మంజు వారియర్ కూడా మమ్ముట్టి తో ఉన్న పిక్ ని తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. వెల్కమ్ బ్యాక్ టైగర్ అంటూ క్యాప్షన్ పెట్టింది. అలాగే మమ్ముట్టి మేకప్ మ్యాన్ జార్జ్ కూడా మమ్ముట్టి కోలుకున్నట్లుగా చెప్పడంతో ఆయన అభిమానులు చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు