Advertisementt

మోస్ట్ పాపులర్ హీరోయిన్ సమంత

Wed 20th Aug 2025 01:14 PM
samantha  మోస్ట్ పాపులర్ హీరోయిన్ సమంత
Most popular heroine Samantha మోస్ట్ పాపులర్ హీరోయిన్ సమంత
Advertisement
Ads by CJ

సినిమాలు ఒప్పుకోవడం లేదు, ఎలాంటి షూటింగ్స్ చెయ్యడం లేదు.. కానీ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లిస్ట్ లో పదే పదే నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుంది సమంత రౌత్ ప్రభు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తున్న సమంత మరొకసారి జూలై నెలకు గాను ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలిచింది. 

గత కొన్ని నెలలుగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఇండియాలోని మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్‌లో సమంత అగ్రస్థానంలో నిలుస్తూ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి షాకిస్తుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడానికి కారణం ఆమె తరచూ ఏదో విధంగా వార్తల్లో నిలవడమే అంటున్నారు. 

రాజ్ నిడమోరు తో సమంత డేటింగ్ లో ఉంది, ఆమెకు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది, త్వరలోనే రాజ్ ను పెళ్లాడబోతుంది అనే వార్తల నేపథ్యంలో ఆమె కొన్ని నెలలుగా ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా మారిపోయింది అంటున్నారు. జులై నెల ఆర్మాక్స్ లిస్ట్‌లో సమంత కు ఫస్ట్ ప్లేస్ రాగా అలియా భట్ 2వ స్థానంలో నిలిచింది. 

ఆతర్వాత బాలీవుడ్ భామ దీపికా పదుకొణె 3వ స్థానంలో, కాజల్ అగర్వాల్ 4వ స్థానంలో, త్రిష కృష్ణన్ 5వ స్థానంలో నిలిచారు. 

Most popular heroine Samantha:

Samantha is consistently ranked as one of India most popular heroine

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ