అనసూయ యాంకర్ గానే కాదు అటు నటి గాను తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రస్తుతం టివి షోస్ కి కాస్త బ్రేకిచ్చి నటిగానే కొనసాగుతుంది, అంతేకాదు షాప్ ఓపినింగ్స్ అంటూ పలు సిటీస్ లో తిరుగుతుంది. రిబ్బన్ కటింగ్స్ తోనూ అనసూయ బాగానే సంపాదిస్తుంది.
తాజాగా నందిగామ లోని GV మాల్ ఓపినింగ్ కి వెళ్లిన అనసూయ అక్కడ డాన్స్ చేస్తూ తన అభిమానులను ఉత్సాహపరిచింది. అంతేకాదు అనసూయ తాను చేస్తున్న సినిమా ప్రాజెక్ట్స్ అలాగే బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తను మూడు సినిమాలకు సైన్ చేశాను అవి ఇంకా మొదలు కావాల్సి ఉంది అని చెప్పిన అనసూయ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి తల్వార్ లో ఓ పాత్ర పోషిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది.
ఫ్యామిలీ అంతా కలిసి చూసే మరో సినిమా ఓకే చేశాను. టైటిల్ కూడా చాలా బాగా ఉంటుంది. కానీ చెప్పకూడదు అన్న అనసూయ ను అక్కడే ఉన్న ఓ ఛానల్ యాంకర్ మీరు బిగ్ బాస్ కి అవకాశం వస్తే వెళతారా అని అడిగితే.. దానికి అనసూయ ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ ఇచ్చింది. నేను బిగ్ బాస్ లోకి వెళ్లడమా.. ఆల్రెడీ ఒకటీ రెండుసార్లు దెబ్బలు పడతాయ్ రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయిపోయింది.
నేను బిగ్ బాస్ కి వెళ్తానని అనుకోవడం లేదు. అసలు నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోవడం లేదు. బిగ్ బాస్ లో ఉండలేను. కానీ ఆ షోలో పాల్గొనే వారందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ అనసూయ బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.