బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ చిత్రం డిసెంబర్ 5 రిలీజ్ అంటూ ప్రకటించడంతో ఆ సినిమాపై ప్రస్తుతం అందరిలో ఆసక్తి ఏర్పడింది. కారణం అదే డిసెంబర్ 5 న ప్రభాస్ రాజా సాబ్ విడుదల కావడంతో డిసెంబర్ 5 బాక్సాఫీసు బరిపై అందరిలో అంచనాలు మొదలయ్యాయి.
అయితే తాజాగా రణ్వీర్ సింగ్ దురంధర్ సెట్ లో చిత్ర బృందానికి ఫుడ్ పాయిజన్ అయిన విషయం హాట్ టాపిక్ అయ్యింది. జమ్ముకశ్మీర్ లోని లడఖ్ లో ధురంధర్ చిత్ర షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ముగిసి సెట్ లోని ఆరొందలమంది సభ్యులు నైట్ భోజనం తినేందుకు సిద్ధమయ్యారని, భోజనం తిన్న కొద్ధి నిముషాలకే కొంతమందికి వాంతులు, మరికొంతమందికి కడుపునొప్పి రావడంతో అందరిని హుటాహుటిన లెహ్ లోని ఎస్ఎన్ఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స ఇప్పించారని తెలుస్తుంది.
వాంతులు చేసుకుని, కడుపు నెప్పితో బాధపడిన అందరికి డాక్టర్స్ టెస్ట్ లు చెయ్యగా వారు తిన్న ఆహారంలో ఏదో కలిసింది అని, అందుకే అందరూ ఇబ్బంది పడ్డారని వెల్లడించడంతో.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ధురంధర్ చిత్ర బృందం తిన్న ఆహారం శాంపిల్స్ ను తీసుకుని పరీక్షలకు పంపించారని తెలుస్తుంది.
ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారని, ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారంతా క్షేమంగా ఉన్నారని తెలుస్తుంది.