Advertisementt

మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో ర‌ష్మిక‌

Tue 19th Aug 2025 12:05 PM
thama  మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో ర‌ష్మిక‌
Rashmika Mandanna as Thama మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో ర‌ష్మిక‌
Advertisement
Ads by CJ

ర‌ష్మిక మంద‌న్న కెరీర్ లో వ‌రుస ప్ర‌యోగాల‌తో దూసుకుపోతోంది. పుష్ప‌లో శ్రీ‌వ‌ల్లిగా, యానిమ‌ల్ లో గీతాంజ‌లిగా అద్భుత న‌ట‌న‌తో అల‌రించిన ర‌ష్మిక‌, త‌దుప‌రి మ‌డోక్ ఫిలింస్ హార‌ర్ థ్రిల్ల‌ర్ - `థామ‌`లో మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రంలో `త‌డ‌కా` అనే అప‌ర‌ శ‌క్తిగా ర‌ష్మిక న‌ట‌న మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇది సినిమా ఆద్యంతం పాజిటివిటీ నింపే పాత్ర‌.

తాజాగా `థామ` నుంచి ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఈ కొత్త లుక్ నిజానికి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ర‌ష్మిక ఇందులో క్రోధంతో రౌద్ర‌ర‌సం పండిస్తూ క‌నిపించింది. దీనిని బట్టి ఆ పాత్ర ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందోన‌ని అభిమానులు ఎవ‌రికి వారు అంచ‌నాలు వేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో కార‌డివి, దూరంగా మంట‌లు, గిరిజ‌నం ఎదురు చూపులు.. వ‌గైరా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. ఇది ఆత్మ‌లు- దెయ్యాల క‌థ‌ల‌ నేప‌థ్యంలో హార‌ర్ థ్రిల్ల‌ర్. ఇందులో ఆయుష్మాన్ ఖురానా అలోక్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 

`ఇన్సానియత్ కి ఆఖ్రీ ఉమీద్` (మానవత్వానికి చివరి ఆశ) అనేది ట్యాగ్ లైన్. నవాజుద్దీన్ సిద్ధిఖీ `అంధేరే కా బాద్షా` (చీకటి రాజు)గా క‌నిపిస్తాడు. స్త్రీ 2 తో భారీ విజ‌యాన్ని సాధించిన‌  మ‌డాక్ ఫిలింస్ లో ర‌ష్మిక మంద‌న్న అవ‌కాశం అందుకోవ‌డం అదృష్టం. ఇప్పుడు స్త్రీ 2 త‌ర‌హాలో కాకుండా మ‌రో కొత్త హార‌ర్ జాన‌ర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం న‌టిగా త‌న‌కు మ‌రింత గుర్తింపు తెస్తుంద‌ని ర‌ష్మిక భావిస్తోంది.

Rashmika Mandanna as Thama:

Thama: Ayushmann Khurrana, Rashmika Mandanna First Look

Tags:   THAMA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ