Advertisementt

మండే కూడా కూలి డామినేషన్

Tue 19th Aug 2025 10:42 AM
coolie  మండే కూడా కూలి డామినేషన్
Coolie dominates War 2 మండే కూడా కూలి డామినేషన్
Advertisement
Ads by CJ

విడుదలకు ముందు నుంచే లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలి చిత్రం హిందీ వార్ 2పై డామినేషన్ చూపిస్తూ వచ్చింది. వార్ 2 - కూలి రెండు సినిమాల విడుదలకు ముందు కూలి ఎంతగా ఆధిక్యత ప్రదర్శించిందో, టికెట్ బుకింగ్స్ లోనే కాదు  సినిమా విడుదలయ్యాక కూడా కూలి దే పై చెయ్యి అయ్యింది. కూలి vs వార్ 2 ఓపెనింగ్స్ లోను కూలి నే టాప్ లో నిలిచింది. 

ఇక మొదటి వీకెండ్ కలెక్షన్స్ లోను 100 కోట్ల తేడాతో కూలి వార్ 2 పై పైచెయ్యి సాధించింది. లాంగ్ వీకెండ్ లో వార్ 250 కోట్లు కలెక్షన్స్ రాబడితే.. కూలి ఏకంగా 350 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే వార్ 2, కూలి విడుదలయ్యాక కూలి పై ఒకింత వార్ 2 కే ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ స్టార్ క్యాస్ట్ ప్రేక్షకులు కూలి వైపు మొగ్గు చూపేలా చేసింది. 

ఇక మండే టెస్ట్ లో కూలి, వార్2 పెరఫార్మెన్స్ లు ఎలా ఉంటాయో అని చాలామంది క్యూరియాసిటీగా ఎదురు చూసారు. మండే నాడు కూడా వార్ 2పై కూలి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. వార్ 2 డే 5 సోమవారం 8.5 కోట్లు కలెక్ట్ చేస్తే.. కూలి మాత్రం సోమవారం ఐదోరోజు 12.15 కోట్లు కలెక్ట్ చెయ్యడం చూసి వార్ 2 కన్నా కూలి బెటర్ గా పెరఫార్మ్ చేస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Coolie dominates War 2 :

Coolie dominates War 2 on day 5

Tags:   COOLIE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ