పెద్ది: చరణ్-జాన్వీ పై అద్దిరిపోయే డ్యూయెట్

Tue 19th Aug 2025 04:19 PM
ram charan  పెద్ది: చరణ్-జాన్వీ పై అద్దిరిపోయే డ్యూయెట్
Ram Charan To Groove To A. R. Rahman Racy Tune పెద్ది: చరణ్-జాన్వీ పై అద్దిరిపోయే డ్యూయెట్
Advertisement
Ads by CJ

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది పై భారీ అంచనాలే ఉన్నాయి. 2026 మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే రోజుకి పెద్ది ని విడుదల చేస్తామని అధికారికంగా డేట్ అనౌన్స్ చెయ్యడమే కాదు, దానికి తగ్గట్టుగా బుచ్చిబాబు షూటింగ్ ని చకచకా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది షూటింగ్ కి కార్మికుల సమ్మె కారణంగా బ్రేకులు పడ్డాయి. 

అయితే రెహమాన్ మ్యూజిక్ దర్శకత్వంలో పెద్ది కి సంబందించిన సాంగ్ షూట్ కి బుచ్చిబాబు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేస్తున్నారట. రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ పై గ్రాండ్ గా డ్యూయెట్ సాంగ్ ను తెర‌కెక్కించ‌నున్నార‌ని చెబుతున్నారు. రెహ‌మాన్ ఈ సినిమాకు నెక్ట్స్ లెవెల్ ఆల్బ‌మ్ ను ఇచ్చార‌ని అంటున్నారు.

ఈ సాంగ్ లో రెహ‌మాన్ మ్యూజిక్, రామ్ చ‌ర‌ణ్ స్టెప్పులు, జాన్వీ కపూర్ గ్లామ‌ర్ ట్రీట్ అన్నీ ఫ్యాన్స్ కు ప‌క్కా ట్రీట్ ఇస్తాయ‌ని చిత్ర బృందం చెబుతున్న మాట. మరి పెద్ది కోసం రామ్ చరణ్ బీస్ట్ లుక్ లో కనిపిస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ విలన్ గా జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. 

Ram Charan To Groove To A. R. Rahman Racy Tune:

Peddi: Ram Charan will be dancing to a Rahman composition

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ