అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల నుంచి మెప్పు పొందలేకపోయిన సంగతి తెలిసిందే. బలహీనమైన కథనం, ఆకట్టుకోని వీఎఫ్ఎక్స్ తో సినిమా తేలిపోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ ఎంత హార్డ్ వర్క్ చేసినా, హృతిక్ అద్భుతంగా నటించినా దాని ఫలితం లేకుండా పోయిందని విమర్శలు వచ్చాయి.
థియేటర్లలో వీక్షించిన మాస్ ఫ్యాన్స్, యాక్షన్ ప్రియులకు ఇది కొంతవరకూ కనెక్టయినా కానీ, చాలా మంది విశ్లేషకులకు ఇది రుచించలేదు. ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సయ్యిందని విమర్శించారు. ఇప్పుడు పఠాన్, వార్, ఫైటర్ వంటి చిత్రాలకు సిద్ధార్థ్ ఆనంద్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన రాజ్ వీర్ అషర్ `వార్ 2`ని తీవ్రంగా విమర్శించాడు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్శ్ లో ఇది అత్యంత బలహీనమైన సినిమా అని విమర్శించడమేగాక, ఇందులో కథ అంత బాలేదని, వీఎఫ్ ఎక్స్ వర్క్ అస్సలు నచ్చలేదని విమర్శించాడు. ఎంతో ఎగ్జయిటింగ్ గా సినిమా కోసం ఎదురు చూస్తే తీవ్ర నిరాశ ఎదురైందని అతడు క్రిటిసైజ్ చేసాడు.
వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ హృతిక్ తో మ్యాచ్ చేస్తూ అతడు నటించాడని ఉత్తరాదిన మంచి టాక్ వినిపించింది. ఇది ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద తారక్ ఇమేజ్ ని పెంచే అంశం.