మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు కి జోడిగా నయనతార కనిపించనుంది. అనిల్ రావిపూడి మెగా 157 ఓపెనింగ్ నుంచే ఈప్రాజెక్టు పై అందరి అటెన్షన్ ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు.
సంక్రాతి టార్గెట్ గా తెరకెక్కుతున్న మెగా 157 చిత్ర టీజర్ ని అలాగే టైటిల్ ని మెగాస్టార్ బర్త్ డే రోజు ఆగష్టు 22 న రివీల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం చిరు బర్త్ డే. ఆ రోజు మెగా 157 టైటిల్ టీజర్ రాబోతుంది. అయితే ఈ చిత్రంలో చిరు డ్రిల్ మాస్టర్ గా కనిపించబోతున్నారు. ఆయనకు వైఫ్ గా నయనతార నటిస్తుంది.
ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తారని, అంతేకాదు ఈ చిత్రంలో వెంకటేష్ క్యామియో గా కనిపించనున్నారు. తాజాగా అనిల్ రావిపూడి మెగా 157 పై ఓ ఈవెంట్ లో ఇచ్చిన క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ లో మెగా 157 టైటిల్ ను మన శంకరవరప్రసాద్ గారు అని అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పేసాడు.
మెగా 157 లో శంకర వరప్రసాద్ అనే పాత్రలో చిరు కనిపించబోతున్నారు అని, వచ్చే సంక్రాంతికి ఈ సినిమాకు రిలీజ్ చేస్తాం అంటూ అనిల్ రావిపూడి క్రేజీగా అప్ డేట్ అందించారు.