అనిల్ కుమార్ ఫెడరేషన్ అధ్యక్షుడు.
గత 15 రోజులగా మా కార్మిక వేతనాలు పెంచడానికి మేము సమ్మె చేస్తున్నాం
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారు
24 క్రాఫ్ట్స్ నుండి 72 మందితో మాట్లాడారు
నిర్మాతలు మా మాట వినకుండా మా మీదె నిందలు వేస్తున్నారు.
ఏదేమైనా మా వర్కర్స్ బావుండాలి అలాగే నిర్మాతలు కూడా బావుండాలి
మేము 2 కండీషన్స్ కి ఒప్పుకుంటే మేమేం నష్టపోతామో చిరంజీవి గారికి వివరించాం
ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ గురించి కూడా మెగాస్టార్ గారికి విన్నవించుకున్నాం .
మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి చిరంజీవి గారు చెప్పారు
రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నాం.
ఛాంబర్ నుండి కూడా మాకు పిలుపు వచ్చింది
రేపు ఛాంబర్ తో కూడా సమావేశం కానున్నాం .
మేం అడిగినట్లు గానే మాకు వేతనాలు వస్తాయి అని మేం భావిస్తున్నాం
చిరంజీవి గారు మాట్లాడినా బాలయ్య బాబు గారు మాట్లాడినా మా సమస్య పరిష్కారం కోసమే మాట్లాడతారు కానీ ఎవరు వైపు మొగ్గు చూపి మాట్లాడరు..