ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రీసెంట్ గానే అంటే జులై 31 న కోట శ్రీనివాసరావు అనారోగ్య కారణాలతో కన్ను ముయ్యగా.. నేడు సోమవారం ఆగష్టు 18న ఆయన భార్య రుక్మిణి మృతి చెందారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోట భార్య రుక్మిణి భర్త పోయిన మూడు వారాల్లోగా ఆవిడ కూడా కన్నుముయ్యడం కోట ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
కోట శ్రీనివాసరావు పోయిన బాధనుంచి కోలుకొకుండానే ఆయన కుటుంబ సభ్యులకు కోట భార్య రుక్మిణి మరణం మరింత బాధను మిగిల్చింది. కోట శ్రీనివాస రావు కు ఆయన భార్య రుక్మిణి అంటే చాలా ఇష్టం. కానీ ఒకప్పుడు తను సినిమా షూటింగ్స్ తో బిజీగా అంటే నాలుగు షిఫ్ట్ ల్లో పని చేసిన సందర్భంలో ఆమెను పట్టించుకోలేకపోయాను అంటూ అనేకసార్లు బాధపడ్డారు.
ప్రస్తుతం కోట భార్య రుక్మిణి మరణ వార్త ఆయన అభిమానులను కలిచివేసింది. పలువురు ప్రముఖులు కోట భార్య రుక్మిణి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.