Advertisementt

వార్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Mon 18th Aug 2025 03:20 PM
war 2  వార్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
War 2 Crosses 250 Crore Mark వార్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్-టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 ఆగష్టు 14 న భారీ అంచనాల నడుమ విడుదలైంది. వార్ 2 ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. వార్ 2 కి ప్లాప్ టాక్ రాకపోయినా.. మిక్స్డ్ టాక్ రావడం, అదే రోజు విడుదలైన కూలి వార్ 2 ని డామినేట్ చెయ్యడంతో వార్ 2కి అనుకున్న కలెక్షన్స్ రావడం లేదు. 

ఫస్ట్ వీకెండ్ లో ఆగష్టు 15 కలిసి రావడం వార్ 2 కి కాస్త హెల్ప్ అయ్యింది. తెలుగు, తమిళ, హిందీలో విడుదలైన ఈ చిత్రానికి  హిందీలో బాగానే వసూళ్లు వచ్ఛాయి. తమిళనాట కూలి వార్ 2 ని తొక్కేసింది. తెలుగులో కూడా వార్ 2 పై కూలి డామినేషన్ కనిపించినా.. నార్త్ లో వార్ 2 కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. 

టాక్ తో సంబంధం లేకుండా ఆగష్టు 15 హాలిడే కి వార్ 2 సాలిడ్ జంప్ అందుకుంది. హిందీ నెట్ లో ఏకంగా 55 శాతం జంప్ ని వార్ 2 అందుకుంది. .నార్త్ లో వార్ 2.. 4వ రోజు ₹25 కోట్లు నెట్ ను సాధించింది. హిందీలో మొత్తం 4 రోజులకు గానూ ₹123 కోట్లు నెట్ ను వార్ సాధించింది. అలాగే తెలుగు, తమిళ, ఓవర్సీస్, హిందీలో వార్ ఫస్ట్ వీకెండ్ లో 250 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఇక సోమవారం వార్ 2 పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 

War 2 Crosses 250 Crore Mark:

War 2 Four Days Worldwide Boxoffice Collections

Tags:   WAR 2
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ