Advertisementt

SSMB29 కీలక షెడ్యూల్ కోసం క్రేజీ సెట్

Mon 18th Aug 2025 01:56 PM
ssmb29  SSMB29 కీలక షెడ్యూల్ కోసం క్రేజీ సెట్
Crazy set for SSMB 29 key schedule SSMB29 కీలక షెడ్యూల్ కోసం క్రేజీ సెట్
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న SSMB 29 కు సంబంధించి డీటెయిల్స్ అనేకన్నా అద్భుతమైన అప్ డేట్ ను మహేష్ బర్త్ డే నుంచి స్కిప్ చేసి నవంబర్ లో ఇస్తున్నామని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. సో అప్పటివరకు మహేష్ ఫ్యాన్స్ SSMB 29 కు సంబందించిన లీకెడ్ న్యూస్ తోనే సరిపెట్టుకోవాలి. 

ప్రస్తుతం SSMB 29 షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఈ గ్యాప్ లో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఛిల్ అవుతుంటే.. ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు తమ తమ పనుల్లో బిజీగా వున్నారు. వచ్చే నెల నుంచి SSMB 29 కు సంబందించిన కీలక షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలు కాబోతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో SSMB 29 కోసం ప్రత్యేకంగా భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ షెడ్యూల్ చాలా కీలకమైన షెడ్యూల్ అని, సినిమాలో చాలా ఇంపార్టెంట్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. SSMB 29 లో మహేష్ చేస్తున్న రోల్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

Crazy set for SSMB 29 key schedule:

Interesting update on SSMB29

Tags:   SSMB29
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ