కన్నడ స్టార్ హీరో యష్ కెజిఎఫ్ తర్వాత చేస్తున్న మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో నయనతార యష్ కి సోదరి పాత్రలో కనిపించడమే కాదు, బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఇప్పుడు ఈ చిత్రంలోకి ఎన్టీఆర్ హీరోయిన్ అదేనండి.. ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని అనుకుంటున్నారు. అది ఇంకా కన్ ఫమ్ కాలేదు కానీ.. ఇప్పుడు ఈ రుక్మిణి వసంత్ యష్ టాక్సిక్ లో భాగం కాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అయితే ఈ చిత్రంలో మరికొందరు హీరోయిన్స్ భాగమయ్యారనే వార్త ప్రచారంలో ఉండడంతో.. ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా టాక్సిక్ లోకి అడుగుపెట్టడంతో ఇంకెంతమంది ఫీమేల్ లీడ్స్ ని సెలెక్ట్ చేస్తారు గీతూ అంటూ డైరెక్టర్ ని యష్ అభిమానులు అడుగుతున్నారు.