Advertisementt

స్త్రీశక్తి పథకం పై పడిన వైసీపీ

Sun 17th Aug 2025 04:49 PM
ycp  స్త్రీశక్తి పథకం పై పడిన వైసీపీ
Why YCP is Unhappy With the Free Bus స్త్రీశక్తి పథకం పై పడిన వైసీపీ
Advertisement
Ads by CJ

ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు చూసి వైసీపీ పార్టీ నేతలు కుళ్ళుకుంటున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఎక్కడ మంచి మార్కులు పడిపోతాయో అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పథకం అమలులోకి తీసుకొచ్చినా వైసీపీ పార్టీ దానిని ఏదో విధంగా చెడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ వేస్తుంది. 

ఆగష్టు 15 న ఏపీలో కూటమి సర్కార్ ప్రారంభించిన ఉచిత బస్సు పథకం సక్సెస్ కావడంతో వైసీపీలో భయం మొదలైంది. మొన్నటి వరకు ఉచిత బస్సు పథకం ఎప్పుడూ అంటూ నానాయాగి చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అది అమలవుతుంటే టెన్షన్‌ పడుతున్నారు. ఫ్రీ బస్సు స్కీం సక్సెస్‌ ఐతే తమను ప్రజలు పట్టించుకోరనే ఆందోళనలో ఉన్నారు. దీంతో ఉచిత బస్సు పథకంపై ఫేక్ ప్రచారం మొదలు పెట్టేశారు. గతంలో కర్ణాటక, తెలంగాణలో జరిగిన వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు రాక్షాసానందం పొందుతున్నారు. 

ఆగస్టు 15న మహిళలకు కూటమి సర్కార్‌ ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించింది. కర్ణాటక సహా ఉచిత బస్సు అమలవుతున్న రాష్ట్రాల్లో విధివిధానాలు అధ్యయనం చేసిన తర్వాతే ఏపీలో ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఫ్రీ బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికైనా మహిళలు ఫ్రీగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. మొత్తం 5 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. 

ఐతే చిన్న చిన్న కారణాలను చూపించి వైసీపీ నేతలు ఫ్రీ బస్సు స్కీంపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. AC బస్సుల్లో ఫ్రీ ఎందుకు లేదు, పేదలు AC బస్సుల్లో వెళ్లకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక TTDకి చెందిన సప్తగిరి బస్సులో ఎందుకు వెళ్లనివ్వరంటూ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఐతే  ఈ బస్సులు టీటీడీ అధీనంలో నడుస్తాయి. ఈ విషయం తెలిసికూడా ఉద్దేశపూర్వకంగానే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.  

టీడీపీ నేతలు సైతం వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ నేతల విమర్శలపై స్పందించిన మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్‌ పీతల సుజాత వైసీపీ అధినేత జగన్‌ సతీమణి భారతిరెడ్డి కూడా ఫ్రీ బస్సులో ప్రయాణించొచ్చని చెప్పారు. కానీ ఆమెకు రాష్ట్రంలోని చిరునామాతో ఉన్న ఆధార్‌ కార్డో, గుర్తింపు కార్డో ఉండాలన్నారు. 

ఉచిత బస్సు పథకంపై విమర్శలు చేయడం వైకాపా నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. 74% బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ అవకాశం లభిస్తోంది. వైసీపీ హయాంలో ప్రజలు నరకయాతన పడ్డారు అంటూ మహిళలు వైసీపీ పై నిప్పులు చెరుగుతున్నారు. 

Why YCP is Unhappy With the Free Bus:

YCP party

Tags:   YCP
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ