కింగ్ నాగార్జున నా సామి రంగ చిత్రం తర్వాత సోలో హీరోగా సినిమాలు మానేసి సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటున్నారు. అందులోను తమిళ హీరోలైన ధనుష్, రజినీకాంత్ చిత్రాల్లో కింగ్ నాగార్జున కీలకమైన రోల్స్ లో కనిపించారు. కుబేర చిత్రంలో దీపక్ గా నాగార్జున రోల్ కి క్లాప్స్ పడ్డాయి. కూలి చిత్రంలో సైమన్ గా ఫస్ట్ టైమ్ విలన్ గా అద్దరగొట్టారు.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా చెయ్యడానికి రెడీ అవుతున్నారు. మరోపక్క అక్కినేని అభిమానులు సర్ నాగార్జున గారు నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అంటున్నారు. ఒకవేళ నాగార్జున ఆయన చిన్న కొడుకు అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ విడుదలయ్యే వరకు సోలోగా కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టరా అనే అనుమానం లేవనెత్తుతున్నారు.
అసలు కూలి తర్వాత నాగార్జున నెక్స్ట్ ప్లాన్ ఏమిటి, ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ మొదలు పెడతారు అనే విషయంలో అక్కినేని అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం చాలా అతృతతో కనిపిస్తున్నారు. మరి నాగార్జున నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అనేది ఆయన ఎప్పుడు రివీల్ చేస్తారో కాస్త వేచి ఉండాల్సిందే.