Advertisementt

నిధి అగర్వాల్ కి రాజా సాబ్ బర్త్ డే ట్రీట్

Sun 17th Aug 2025 04:59 PM
nidhhi agerwal  నిధి అగర్వాల్ కి రాజా సాబ్ బర్త్ డే ట్రీట్
The Raja Saab: Birthday Poster of Nidhhi Agerwal నిధి అగర్వాల్ కి రాజా సాబ్ బర్త్ డే ట్రీట్
Advertisement
Ads by CJ

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన రాజా సాబ్ టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది.

రాజా సాబ్ మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను మరింతగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటానని ఆశిస్తోంది. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజా సాబ్ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

The Raja Saab: Birthday Poster of Nidhhi Agerwal:

The Raja Saab: Birthday Poster of the Beautiful Actress Nidhhi Agerwal Unveiled

Tags:   NIDHHI AGERWAL
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ