వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కేరెక్టర్ కి ఎంత మంచి పేరొచ్చిందో.. వార్ 2 విఎఫ్ ఎక్స్ కి అంత దారుణమైన విమర్శలొచ్చాయి. ఎన్టీఆర్ ని సిక్స్ ప్యాక్ లో చూపించిన సీన్స్, ఇంకా ఇలాంటి చాలా సీన్స్ విషయంలో అయాన్ ముఖర్జీ సీజీ వర్క్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అంతకుముందు హరి హర వీరమల్లు చీప్ క్వాలిటీ గ్రాఫిక్స్ పై సోషల్ మీడియాలో ఇంకా ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి.
వార్ 2 విఎఫ్ ఎక్స్ వర్క్ పై వస్తున్న ట్రోల్స్ చూసిన బోయపాటి అలెర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అఖండ తాండవం గ్రాఫిక్ వర్క్ పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ తో బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ తాండవం వచ్చే నెల 25 న విడుదల టార్గెట్ గా రెడీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తవడమే కాదు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బోయపాటి తలమునకలై ఉన్నారు.
ప్రస్తుతం అఖండ 2 సీజీ మరియు విఎఫ్ ఎక్స్ వర్క్ జరుగుతుంది. సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని ఎక్కడా ఏ మిస్టేక్ లేకుండా, విఎఫ్ ఎక్స్ క్వాలిటీగా ఉండేలా బోయపాటి చూసుకుంటున్నారట. మరి అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అఖండ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి.