యాంకర్ గా బుల్లితెర పై సినీ ప్రస్థానం మొదలుపెట్టిన అనసూయ భరద్వాజ్.. ఆ తర్వాత వెండితెర పై సత్తా చాటుతుంది. ప్రస్తుతం క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న అనసూయ భరద్వాజ్ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. సోషల్ మీడియా నుంచి తనని ఎవరైనా నెగెటివ్ గా కామెంట్ చేస్తే వారిని నిర్ధాక్షిణ్యంగా బ్లాక్ చేస్తుంది.
ఇక భర్త భరద్వాజ్ గురించి, అలాగే తన పర్సనల్ విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడే అనసూయ ఈమధ్యనే కొడుకుకి ఒడుగు ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించింది. అంతేకాదు తన కొత్తింటిని తనకిష్టమైనట్టుగా కట్టించుకుని గృహ ప్రవేశం కూడా చేసింది. ఇక టివి షోస్, సినిమా షూటింగ్స్ తో బిజీగా వుండే అనసూయ షాప్ ఓపెనింగ్స్ తోను హడావిడి చేస్తుంది.
లేటెస్ట్ ఫొటోస్ షూట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే అనసూయ భరద్వాజ్ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే.. వావ్ అనసూయ చీరకట్టులో అద్దరగొట్టేశావ్ అంటూ కామెంట్ చెయ్యాల్సిందే. రెడ్ చెక్స్ డిజైనర్ శారీ లో అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫోజులు చూస్తే నిజంగా యూత్ కూడా అనసూయ భజన చెయ్యాల్సిందే.