Advertisementt

వార్ 2 వార్: Jr NTR కు టీడీపీ ఎమ్మెల్యే సారీ

Sun 17th Aug 2025 01:29 PM
ntr  వార్ 2 వార్: Jr NTR కు టీడీపీ ఎమ్మెల్యే సారీ
TDP MLA sorry to Jr NTR fans వార్ 2 వార్: Jr NTR కు టీడీపీ ఎమ్మెల్యే సారీ
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాలు తను చేసుకుంటున్నా టీడీపీ అభిమానులు, కార్యకర్తల్లో చాలామంది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, టీడీపీ కి పని చెయ్యాలనే కోరిక వెలిబుచ్చడమే కాదు, ఎన్టీఆర్ ఏ ఈవెంట్ లో కనిపించినా ఆయన అభిమానుల్లో కొందరు సీఎం సీఎం అనే నినాదాలు చెయ్యడం కనిపిస్తూనే ఉన్నాయి. 

అయితే ఎన్టీఆర్ ను టీడీపీ లోకి ఆహ్వానించేందుకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అంతకు మించి ఆయన్ను ద్వేషించే టీడీపీ పార్టీ వాళ్ళూ ఉన్నారు. ఎన్టీఆర్ ఎదుగుదలను ముఖ్యంగా లోకేష్ ను ఇష్టపడే వాళ్ళు ఎన్టీఆర్ ను ద్వేషిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన వార్ 2  విడుదలైంది. ఎన్టీఆర్ వార్ 2 ఆడదు, అది ప్లాప్ అవుతుంది అంటూ టీడీపీ ఎమ్యెల్యే ఒకరు ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడిన ఆడియో విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. 

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి వైరల్ అవ్వగా... అది విన్న ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలోని ఎమ్మెల్యే ఆఫీసును చుట్టుముట్టి రచ్చ చేస్తున్నారు. కానీ ఆ ఎమ్యెల్యే మాత్రం తానేమి ఎన్టీఆర్ ను కించపరచలేదు, అదంతా ఫేక్ అంటూ వాదిస్తున్నారు. 

ఆ ఆడియోలు తనవి కావని, అవన్నీ భోగస్ అని, తనపై కుట్ర జరుగుతోందని.. అయినప్పటికీ ఎన్టీఆర్ విషయంలో తన పేరు వినిపించింది గనక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతున్నట్టుగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సారీ చెప్పారు. 

TDP MLA sorry to Jr NTR fans:

TDP MLA Daggupati Venkateswara Prasad sorry to Jr NTR fans

Tags:   NTR
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ