పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆతర్వాత ప్రభాస్ చేసిన పాన్ ఇండియా ఫిలిమ్స్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అభిమానులను ఫుల్ గా డిజప్పాయింట్ చేసాయి. కానీ ఆతర్వాత వచ్చిన సలార్, కల్కి 1 చిత్రాలతో మళ్లీ ప్రభాస్ ను ఫామ్ లోకి తీసుకొచ్చేసాయి.
ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ తో పాటుగా అతి త్వరలోనే సందీప్ వంగ తో స్పిరిట్ మూవీ స్టార్ట్ చెయ్యబోతున్నారు. అంతేకాకుండా మరో రెండు చిత్రాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అవే సలార్ 2, కల్కి 2. ఇకపోతే హను రాఘవపూడి తో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ లో ప్రభాస్ సోల్జర్ గా కనిపిస్తారని టాక్.
అయితే ఈచిత్రానికి గాను ప్రభాస్ 180 రోజుల్ కాల్షీట్స్ ఇచ్చారట. మరి ఆ 180 రోజులకు ప్రభాస్ అందుకోబోయే పారితోషికం వింటే నిజంగా షాకవ్వాల్సిందే. ప్రభాస్ ఫౌజీ చిత్రానికి ఏకంగా 150 నుంచి 180 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నారనే వార్త తో ప్రభాస్ ఫ్యాన్స్ అవాక్కవవుతున్నారు. ప్రభాస్ రేంజ్ కి ఈ పారితోషికం పర్ఫెక్ట్ అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.