ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె మొదలై ఈ సోమవారానికి రెండు వారాలు అవుతోంది. ఎన్నిసార్లు ప్రొడ్యూసర్స్, ఫెడరేషన్ సభ్యులు సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపినా సమస్యలు కొలిక్కి రాలేదు.
ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి దగ్గరకు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్య చేరింది
నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య సయోధ్య కుదిరే విధంగా కృషి చేస్తున్న చిరంజీవి.
గత 13 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె రేపు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రేపు నిర్మాతలు, సినీ కార్మిక నాయకులతో విడివిడిగా సమావేశం కానున్న మెగాస్టార్ చిరంజీవి.
సమ్మెకు పరిష్కారం కనుగొనే విధంగా చర్చలు..
ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి తెలుసుకున్న చిరంజీవి.
తాను అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆగస్ట్ నెలలో వద్దు, సమస్య తీరాలి అప్పుడే షూటింగ్ అని చిరు చెప్పినట్లుగా సమాచారం..