అక్కినేని ప్రిన్స్ అఖిల్ ని కింగ్ నాగార్జున స్టార్ హీరో ని చెయ్యాలని ఎంతగా తపన పడుతున్నారో.. అంతకుమించి ఆయన్ని స్టార్ హీరోగా చూడాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. వరసగా సినిమాలు చేస్తున్నా అఖిల్ కి మాత్రం స్టార్ హీరో హోదా ఆమడ దూరంలోనే ఆగిపోతుంది. అందులోను ఏజెంట్ అఖిల్ కెరీర్ లో బిగ్ డిసాస్టర్ గా నిలిచింది.
తాజాగా అఖిల్ లెనిన్ చిత్రంతో రాబోతున్నాడు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్ చిత్ర టీజర్ అఖిల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా నాగార్జున కూలి లో సైమన్ పాత్రకొస్తున్న ఫీడ్ బ్యాక్ తో కూలి విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంది అక్కినేని ఫ్యామిలీ. అఖిల్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రాట్యులేషన్స్ మై కింగ్ అంటూ తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ ఇన్స్టా లో పోస్ట్ పెట్టారు.
ఆ పిక్ లో నాగార్జున పక్కన అఖిల్ ఉన్నాడు. అఖిల్ ఆ పిక్ లో చాలా స్టయిల్ గా నాగార్జున మాదిరిగా హ్యాండ్ సమ్ లుక్స్ తో కనిపించేసరికి అక్కినేని ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు. అఖిల్ న్యూ లుక్ తో ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ మోడ్ లోకి వెళుతున్నారు. అఖిల్ రీసెంట్ గానే జైనాబ్ ని వివాహం చేసుకున్నాడు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.