కింగ్ నాగార్జున కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పిన కూలి కథను ఓకె చెయ్యకపోతే ఓ కప్ కాఫీ తాగి విడిపోదామని లోకేష్ చెప్పారు, కానీ కూలి కథను దాదాపుగా ఏడుసార్లు విన్న తర్వాత నేను ఓకె చేశాను అని నాగార్జునే కాదు, లోకేష్ కూడా చెప్పారు. మరి నాగార్జున తన పాత్రను మాత్రమే చూసుకున్నారు, కూలి స్టోరీ మొత్తం నాగ్ వినలేదా అనేలా కూలి సినిమా రిజల్ట్ ఉంది.
కూలి చిత్రంలో సూపర్ స్టార్ పాత్రకు సరిసమానమైన పాత్ర నాగార్జున సైమన్ పాత్ర ఉంది, అలాగే నాగార్జున కూడా సైమన్ పాత్రలో చాలా బాగా పెరఫార్మ్ చేసారు. స్టయిలింగ్, కాస్ట్యూమ్స్ అన్నిటిలో నాగ్ సూపర్ గా ఉన్నప్పటికి.. ఆయన కేరెక్టర్ కి వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్ పై అక్కినేని ఫ్యాన్స్ లో అసంతృప్తి కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది.
కూలి సినిమా విడుదలయ్యాక నాగ్ పాత్ర బావుంది అంటున్నప్పటికీ.. కూలి చిత్రానికి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసాక నాగార్జున సోలో హీరోగా చెయ్యడం మానేసి ఇలా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడం పై చాలామందిలో చాలారకాల అసంతృప్తులు ఉన్నాయి. కూల్ గా హీరోగా చేసుకోక ఇలా కూలి లో స్టార్ హీరోల నడుమ తేలిపోవడం మాత్రం అభిమానులకు అసలు ఇష్టం లేదు.
అంతేకాదు అటు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోన్న బిగ్ బాస్ కి హోస్ట్ గా చెయ్యడం పై కూడా నాగార్జున ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. మరి ఇవన్నీ నాగార్జున కన్సిడర్ చేస్తే బావుంటుంది అనేది ఫ్యాన్స్ కోరిక.