Advertisementt

బాలయ్య అన్ స్టాపబుల్ ఇక రాదా

Sat 16th Aug 2025 06:50 PM
unstoppable  బాలయ్య అన్ స్టాపబుల్ ఇక రాదా
Is Balayya Unstoppable coming again బాలయ్య అన్ స్టాపబుల్ ఇక రాదా
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా చేసిన ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఆహా ఓటీటీ కి అన్ స్టాపబుల్ టాక్ షో వలన విపరీతమైన క్రేజ్ వచ్చింది. మహేష్ దగ్గర నుంచి రవితేజ వరకు.. ఏపీ సీఎం చంద్రబాబు తో సీజన్ 4 షూట్ చేసారు. 

అయితే గత ఏడాది అక్టోబర్ లో అన్ స్టాపబుల్ సీజన్ 4 వచ్చింది, పూర్తయ్యింది. ఆతర్వాత సీజన్ 5 గురించిన ముచ్చట లేదు. అసలు సీజన్ 5 ఉంటుందా, ఒకవేళ ఉంటే ఈసారైనా మెగాస్టార్ బాలయ్య ముందు కూర్చుంటారా, నాగార్జునను అల్లు అరవింద్ తీసుకొస్తారా.. అంతకన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ ని అన్ స్టాపబుల్ షో లో నందమూరి ఫ్యాన్స్ చూస్తారా.. 

అభిమానుల కోరిక నెరవేరుతుందా, ఎన్టీఆర్ ఈ షో కి వస్తే బాబాయ్-అబ్బాయ్ ని ఓ టాక్ షో లో చూడాలనే కామన్ ఆడియన్స్ కల కూడా నెరవేరుతుంది. మరి ఆహా అల్లు అరవింద్ గారు అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 5 ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అనేది ఇప్పుడు క్యూరియాసిటీగా మారింది.  

Is Balayya Unstoppable coming again:

Unstoppable Talk Show Update

Tags:   UNSTOPPABLE
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ