ఆర్.ఆర్.ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ తో చేసిన దేవర చిత్రం విడుదల సమయంలో కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నా ఈసారి మనం కొడుతున్నామంటూ చాలా కాన్ఫిడెంట్ గా అభిమానులకు భరోసా ఇచ్చారు. ఆతర్వాత ఈసారి ఒక చేత్తో కాదు రెండు చేతులతో కాలర్ ఎగరేసి చెబుతున్నా వార్ 2 తో కొడుతున్నామంటూ ఎన్టీఆర్ అభిమానులకు మాటిచ్చారు.
దేవర పాన్ ఇండియా మూవీ గా విడుదలై సో సో టాక్ తో అభిమానుల బలమైన సంకల్పంతో హిట్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులే గనక దేవర ను పట్టించుకోకపోతే ఎన్టీఆర్ కెరీర్ లో ప్లాప్ గా దేవర మూవీ మిగిలిపోయేది. ఆ విషయాన్ని నిర్మాత నాగవంశీ నే ఒప్పుకున్నారు. మరి అంత కాన్ఫిడెంట్ తో చెప్పిన దేవర రిజల్ట్ అలా ఉంది.
ఇప్పుడు ఎన్టీఆర్ హిందీలో చేసిన మొట్ట మొదటి సినిమా వార్ 2 కి కూడా అదే నమ్మకాన్ని ఎన్టీఆర్ చూపించారు. వార్ 2 లో సెకండ్ హీరోగా ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకున్నారు అంటే.. దానికి తగిన ఆన్సర్ ఎన్టీఆర్ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ చెప్పినట్టుగా వార్ 2 లో కనిపించలేదు. వార్ 2 జస్ట్ యాక్షన్ మూవీగా మిగిలితే.. అందులో ఎన్టీఆర్ రోల్ అభిమానులనే నిరాశపరిచింది.
వార్ 2 ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు కొట్టాలని నిర్మాత నాగవంశీ అన్నారు, కానీ కూలి రూపంలో వార్ 2 ఓపెనింగ్స్ కూడా చెప్పగానే ఉన్నాయి. మరి ఎన్టీఆర్ అభిమానులకు మాటైతే ఇస్తున్నారు కానీ.. అభిమానుల ఆశించిన హిట్ ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు.. అదే ఫ్యాన్స్ కూడా అంటున్న మాట.