Advertisementt

కూలి ఎఫెక్ట్ - ఆలోచనలో టాలీవుడ్ స్టార్స్

Sat 16th Aug 2025 01:16 PM
coolie  కూలి ఎఫెక్ట్ - ఆలోచనలో టాలీవుడ్ స్టార్స్
Coolie Effect - Tollywood stars in dilemma కూలి ఎఫెక్ట్ - ఆలోచనలో టాలీవుడ్ స్టార్స్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్ సినిమాలతో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు. టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ చైర్ ఎక్కేసారు. విక్రం సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ మేకింగ్ కి ఫిదా అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరిద్దరు ఆయనతో సినిమా చెయ్యాలని అనుకున్నారు కూడా. లోకేష్ కూడా ఆ విషయాన్ని పలుమార్లు రివీల్ చేసారు.

అందులో ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్ లు లోకేష్ కనగరాజ్ తో కాంటాక్ట్ లోకి వెళ్లారనే టాక్ నడిచింది. ప్రభాస్ తో లోకేష్ కనగరాజ్ సినిమా ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ కాకపోతే ప్రభాస్ తన కమిట్మెంట్స్ ని పూర్తి చేసుకుని అప్పుడే లోకేష్ కనగరాజ్ LCU లోకి అడుగుపెడతారని ప్రచారం జరిగింది. ఆతర్వాత లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్ మీటింగ్ అనే న్యూస్ వినిపించింది.

అయితే కూలి సినిమా రిజల్ట్ తర్వాత లోకేష్ కనగరాజ్ తో సినిమా చేసే విషయంలో ప్రభాస్, రామ్ చరణ్ లు ఆలోచనలో పడ్డారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. కూలి చిత్రంలో స్టార్ క్యాస్ట్ ని పెట్టి కథ కథనాలను లైట్ తీసుకుని లోకేష్ కనగరాజ్ ఆడియన్స్ ని మోసం చేసారు అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్స్ తో లోకేష్ తో ప్రాజెక్ట్ ల విషయంలో ప్రభాస్, చరణ్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. 

Coolie Effect - Tollywood stars in dilemma:

Can Lokesh kanagaraj Come out of Coolie Effect

Tags:   COOLIE
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ