పరం సుందరి చిత్రంతో కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్యూటిఫుల్ గ్లామర్ గర్ల్ జాన్వీ కపూర్ అందమైన గ్లామర్ లుక్స్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి చక్కటి చీర కట్టులో జాన్వీ కపూర్ అందాలు చూపిస్తూనే సినిమాని ప్రమోట్ చేస్తుంది.
గ్లామర్ కు గ్లామర్, అందానికి అందంతో జాన్వీ కపూర్ ఫ్రెష్ లుక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సుందరి వైట్ ఫ్లవర్ ని ముద్దాడుతూ.. ఫ్లోరల్ ప్రింట్ కాస్ట్లీ సిల్క్ శారీ లో జాన్వీ కపూర్ ఇచ్చిన బ్యూటిఫుల్ ఫోజులకు అందరూ మెస్మరైజ్ అవ్వాల్సిందే. ఆ ఫొటోస్ లో జాన్వీ ని అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.
పరం సుందరి తర్వాత జాన్వీ కపూర్ చేస్తోన్న సౌత్ పాన్ ఇండియా ఫిలిం పెద్ది. ఆ చిత్రంలో రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ జోడి కడుతుంది. ప్రస్తుతం పరం సుందరి ప్రమోషన్స్ పూర్తి కాగానే జాన్వీ కపూర్ పెద్ది షూట్ లో జాయిన్ అవుతుంది.