ఆగష్టు 27 న వినాయకచవితికి స్పెషల్ గా మాస మహారాజ్ రవితేజ మాస్ జాతర ఖచ్చితంగా దిగుతుంది అంటూ మేకర్స్ చాలానే బిల్డప్ ఇచ్చారు. సెకండ్ సాంగ్ వదలడం, అదే స్పీడు లో మాస్ జాతర టీజర్ రిలీజ్ అవడంతో రవితేజ మాస్ జాతర పోస్ట్ పోన్ అవ్వదు, డెఫ్ నెట్ గా వినాయక చవితికి వస్తుంది అనుకున్నారు.
కానీ ఇప్పుడు మాస్ జాతర సైలెంట్ అవడం చూసి మాస్ జాతర మళ్ళీ విడుదల తేదీ మార్చబోతుందా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. వార్ 2 తర్వాత ఇమ్మిడియట్ గా రెండు వారాల్లోనే మాస్ జాతర తో నిర్మాత నాగవంశీ వస్తారని కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు మాస్ జాతర సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆగష్టు 27 అంటే ఇంకా పది రోజుల సమయమే ఉంది. ఇప్పటికి రెండు పాటలు, ఒక టీజర్ వదిలారు, మిగతా ప్రమోషన్స్ లేవు. అంటే మేకర్స్ సినిమా విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉండబట్టే మాస్ జాతర ప్రమోషన్స్ ఆపేశారనే టాక్ మొదలైంది. మరి మాస్ జాతర పోస్ట్ పోన్ వార్త ఎప్పుడు అనౌన్స్ చేస్తారో, మళ్ళీ ఆ కొత్త డేట్ కోసం ఎంత వెయిట్ చెయ్యాలో అనే టెన్షన్ లో రవితేజ ఫ్యాన్స్ ఉన్నారు.