Advertisementt

కన్మణి గా OG గర్ల్

Sat 16th Aug 2025 07:26 PM
priyanka mohan  కన్మణి గా OG గర్ల్
Priyanka Mohan first looks from OG కన్మణి గా OG గర్ల్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న OG చిత్రం సెప్టెంబర్ 25 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్‌ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

తాజాగా OG సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో పవన్ కళ్యాణ్ గర్ల్ గా కనిపించబోతుంది. ఇప్పుడు విడుదలైన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ పోస్టర్ దయ, బలం, నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తోంది. మరో పోస్టర్ ప్రశాంతత మరియు గృహ వాతావరణాన్ని సూచిస్తుంది.

ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉంది. సుజీత్ యొక్క విస్ఫోటన కథనానికి భావోద్వేగ లోతును, ఆకర్షణను పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ జోడిస్తున్నారు. ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అంటూ మేకర్స్ చెబుతున్నారు. 

Priyanka Mohan first looks from OG:

Priyanka Mohan from OG

Tags:   PRIYANKA MOHAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ