బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ టాలీవుడ్ కి పరిచయవుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి `వార్ 2` చిత్రంలో నటించాడు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హృతిక్ హైదరాబాద్ ప్రమోషన్స్ లో `తారక్ నా తమ్ముడు` అంటూ ఎంతో ఎగ్జయిటింగ్ గా కనిపించాడు. ఇప్పుడు హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం `క్రిష్ 4`పై దృష్టి సారిస్తాడు.
ఇంతలోనే అతడు ముంబైలోని రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు పెట్టాడని తెలిసింది. హృతిక్ అతడి తండ్రి రాకేష్ రోషన్ కలిసి హెచ్ఆర్ఎక్స్ ఎల్.ఎల్.పి కింద దాదాపు 31 కోట్ల పెట్టుబడులను భారీ ఆఫీస్ స్పేస్ కోసం ఖర్చు చేసారు. ఇది ముంబైలోని తూర్పు చండివాలి ప్రాంతంలో బూమరాంగ్ అనే భవనంలోని దాదాపు 14000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని అపార్ట్ మెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసారు.
ఇంతకుముందు కూడా అదే భవంతిలో ఐదు ఫ్లాట్లను 35 కోట్లకు హృతిక్ కొనుగోలు చేసారు. హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. దీంతో పాటు అంధేరిలో రెండు ప్లాట్లను 7కోట్లకు కొనుగోలు చేసారు. కేవలం ఈరెండేళ్లలోనే 80కోట్ల వరకూ పెట్టుబడుల్ని రోషన్ లు ముంబై రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టారు.