51మంది డ్ర‌గ్ డీల‌ర్లు.. సెల‌బ్రిటీల్లో టెన్ష‌న్

Fri 15th Aug 2025 06:53 PM
drug  51మంది డ్ర‌గ్ డీల‌ర్లు.. సెల‌బ్రిటీల్లో టెన్ష‌న్
Celebrities 51మంది డ్ర‌గ్ డీల‌ర్లు.. సెల‌బ్రిటీల్లో టెన్ష‌న్
Advertisement
Ads by CJ

ఇటీవ‌లి కాలంలో స్థ‌బ్ధుగా ఉన్నా కానీ, ఇప్పుడు హైద‌రాబాద్ మొత్తం ఉలిక్కిప‌డే ఒక వార్త అందింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బకారంలో ఒక పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం గురించి సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయ‌గా 51 మంది విదేశీ డ్ర‌గ్ డీల‌ర్లు దొరికిపోవ‌డం సంచ‌ల‌న‌మైంది. వీరంతా పార్టీ మ‌త్తులో ఊగి తూగుతున్నారు. మ‌త్తులో చిత్తుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని స‌మాచారం. ఉగాండా, కెన్యా స‌హా మరో రెండు దేశాల నుండి 51 మంది ఆఫ్రికన్ జాతీయులు ఇక్క‌డ ప‌ట్టుబ‌డిన‌ట్టు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది నైజీరియన్లు ఉన్నారు.

ప్ర‌పంచం మొత్తం గంజాయి స‌ర‌ఫ‌రాలో నైజీరియ‌న్ల‌తో పాటు కెన్యా, ఉగాండా నుంచి యువ‌త‌రం ఎక్కువ‌గా దుర్భ‌ల‌త్వానికి అల‌వాటు ప‌డ్డార‌ని పోలీసులు చెబుతున్నారు.  గంజాయి, కొకైన్ వంటి మాద‌క‌ద్ర‌వ్యాల వినియోగం గురించి సమాచారం అందిన తరువాత పోలీసులు ప‌క‌డ్భందీగా పార్టీపై దాడి చేసారు. ఈ దాడిలో మొత్తం 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వీసా గ‌డువు ముగిసాక కూడా న‌గ‌రంలో అక్ర‌మంగా నివ‌శిస‌తున్న మామోస్ అనే లేడీ ఈ పార్టీని ఏర్పాటు చేయ‌గా 51మంది డీల‌ర్లు వ‌చ్చారు. ఘ‌ట‌నా స్థ‌లి నుంచి పోలీసులు 65 బీర్ బాటిళ్లు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీళ్లంద‌రి వీసాలు, పాస్ పోర్టులు లాక్కుని ఇమ్రిగ్రేష‌న్ అధికారులు ప్ర‌తిదీ ఆరా తీస్తున్నారు. ఇందులో 12 మంది పైగా స్టూడెంట్లు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. నైజీరియ‌న్ డ్ర‌గ్ డీల‌ర్లు లేదా ఎవ‌రైనా డ్ర‌గ్ డీల‌ర్ దొరికిపోయిన ప్ర‌తిసారీ సెల‌బ్రిటీల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతూనే ఉన్నాయి. రంగుల ప్ర‌పంచంలో గుట్టు చ‌ప్పుడు కాకుండా సాగే, మాద‌క ద్ర‌వ్యాల నెట్ వ‌ర్క్ అలాంటిది అని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

Celebrities :

Drug Dealer Arrested

Tags:   DRUG
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ