Advertisementt



క్రేజీ కాంబో: వెంకీ-త్రివిక్రమ్ మూవీ స్టార్ట్

Fri 15th Aug 2025 04:13 PM
venkatesh  క్రేజీ కాంబో: వెంకీ-త్రివిక్రమ్ మూవీ స్టార్ట్
Venkatesh-Trivikram movie launched క్రేజీ కాంబో: వెంకీ-త్రివిక్రమ్ మూవీ స్టార్ట్
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చిత్రం కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కలయిక లో ఎట్టకేలకు కొత్త సినిమా మొదలు పెట్టారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. 

సినీ వర్గాలతో పాటు, ప్రేక్షకులలో కూడా వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో సినిమా పట్ల ఎంతో ఆసక్తి ఉంది. త్రివిక్రమ్ యొక్క ప్రత్యేకమైన కథా శైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేష్ ను చూడటం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో త్రివిక్రమ్ పేరుగాంచారు. ఇప్పుడు త్రివిక్రమ్ మరో ఆకర్షణీయమైన, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.

ఇది అరుదైన, మాయాజాల కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. త్రివిక్రమ్ శైలి కథలో వెంకటేష్ ను వెండితెరపై చూడటానికి అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Venkatesh-Trivikram movie launched:

Much Awaited Venkatesh and Trivikram Film Launched

Tags:   VENKATESH
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ