నిజమే గత కొన్ని నెలలుగా ఎన్ని సినిమాలు విడుదలైనా రాని, లేని కళ ఇన్నాళ్లకు బాక్సాఫీసు దగ్గర కనిపిస్తుంది అంటే అది వార్ 2, కూలి చిత్రాల జోరే కారణం. సంక్రాంతి సినిమాలు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు ఇలా బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల కిలకిలలు కాసుల గలగలలు వినిపించాయి.
ఈమద్యలో చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలైనా ఇప్పుడు వార్ 2, కూలి కి వచ్చినంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఆగష్టు 14 న నువ్వా - నేనా అని పోటీ పడిన వార్ 2, కూలి థియేటర్స్ ఫుల్ అయ్యి, ఆడియన్స్ తో థియేటర్స్ కళకళలాడాయి. వార్ 2 కి కూలి కి ఏపీలో ఉదయం ఐదు గంటలకే స్పెషల్ షోస్ పడిపోయాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేసారు.
వార్ 2, కూలి చిత్రాలకు టాక్ ఎలా ఉన్నా ఈ వీకెండ్ మాత్రం థియేటర్స్ లో హౌస్ ఫుల్ పక్కా. కారణం లాంగ్ వీకెండ్. ప్రేక్షకులంతా జాలి మూడ్ లో థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. అందుకే థియేటర్స్ దగ్గర అంత హడావిడి. ఇలా బాక్సాఫీసుని చూసి ఎన్నాళ్ళైందో. నిజమే ఈమద్యలో థగ్ లైఫ్, కుబేర లాంటి పెద్ద చిత్రాలు వచ్చినా కూలి, వార్ 2కు వహ్చిన రెస్పాన్స్ అయితే ఓపెనింగ్ రోజు చూడలేదు.
మళ్లీ ఈ రేంజ్ హడావిడి దసరా బరి అంటే సెప్టెంబర్ 25 న కనిపించే ఛాన్స్ ఉంది. ఆ రోజు బాలయ్య అఖండ తాండవం, పవన్ కళ్యాణ్ OG చిత్రాలు పోటీకి దిగుతున్నాయి.