కింగ్ నాగార్జున ఈమధ్యన సోలో హీరోగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ కేరెక్టర్స్ చేస్తున్నారు. సపోర్టింగ్ అనేకంటే హీరోతో సమానమైన రోల్స్ లో నాగార్జున మెప్పిస్తున్నారు. రీసెంట్ గా ధనుష్ కుబేర లో దీపక్ పాత్రలో నాగార్జున యాక్టింగ్ ధనుష్ పాత్రకు ఈక్వల్ గా ఉంది. దీపక్ కేరెక్టర్ లో కాస్త నెగెటివ్ టచ్ ఉన్నప్పటికి.. ఆ కేరెక్టర్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి చిత్రంలో సైమన్ గా పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ లో కనిపించారు. కూలి చిత్రంలో నాగార్జున సైమన్ రోల్ పై ఫీడ్ బ్యాక్ బావుంది. సైమన్ కేరెక్ట కి వస్తోన్న రెస్పాన్స్ చూసి నాగార్జున ఎందుకు ఈ కేరెక్టర్ కి ఓకె చెప్పారో అర్ధమవుతుంది.
కూలి చిత్రంలో రజినీకాంత్ కన్నా కూసింత ఎక్కువగా సైమన్ కేరెక్టర్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది అనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున సైమన్ కేరెక్టర్, అలాగే సౌబిన్ కేరెక్టర్స్ కూలిని నిలబెట్టాయంటున్నారు. అన్ని లాంగ్వేజెస్ నుంచి కూలి లో నాగార్జున రోల్ కి మంచి రెస్పాన్స్ రావడం చూసి కుబేర లో దీపక్ గా పాస్ అయిన నాగ్ ఇక్కడ కూలి లోను సైమన్ గా పాస్ అయ్యారంటూ అక్కినేని ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.