లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ చేతులు కలిపారు, ఆయన 50 ఇయర్స్ కెరీర్ సెలెబ్రేషన్స్ సమయంలో వస్తోన్న సినిమా కూలి పై అంచనాలు ఎంతగా ఉంటాయో, లోకేష్ కనగరాజ్ ఇంటర్వూస్ లో చెప్పినట్టుగానే కాదు, ఈ సినిమాలో కనిపించిన స్టార్ క్యాస్ట్ కూడా సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది.
ఆ అంచనాలను కూలి అందుకుందా అంటే.. ఆగస్టు 14 న విడుదలైన కూలి ని చూసాక సోషల్ మీడియా వేదికగా కొంతమంది రియాక్షన్ ఇలా ఉంది..
కొన్ని సినిమాల నుంచి కొత్తదనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు..
జస్ట్ ఉన్నది చూసి ఎంజాయ్ చేసి రావాలంతే..
కూలీ కూడా అలాంటి రొటీన్ సినిమానే..
కథ తెలుసు.. స్క్రీన్ ప్లే కూడా ఏమంత గొప్పగా లేదు..
అలాగని కూలీ తీసిపారేసే సినిమా మాత్రం కాదు..
సినిమాలో కొన్ని విజిలింగ్ మూమెంట్స్ ఉన్నాయి..
ఖైదీ, విక్రమ్ స్థాయి గ్రిప్పింగ్ కథ, కథనాలు కూలీలో కనిపించవు..
కాకపోతే రజిని అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకున్నాడు లోకేష్..
ఫస్టాఫ్ వరకు నో కంప్లైంట్స్.. వేగంగానే వెళ్లిపోయింది..
కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం మరోసారి వదిలేసాడు లోకేష్ కనకరాజ్..
లోకేష్ కానగరాజ్ కు ఈ సెకండాఫ్ ఫీవర్ ఏంటో అర్థం కాదు..
ప్రతీసారి ఫస్టాఫ్ వరకు బాగా తీసి.. అసలైన సెకండాఫ్ వదిలేస్తుంటాడీయన..
కూలీకి కూడా ఇదే చేసాడు.. అసలే రొటీన్ కథకు సెకండాఫ్ మరీ రొటీన్ అయిపోయింది..
కాకపోతే అక్కడక్కడా వచ్చే యాక్షన్ సీన్స్.. సౌబిన్ షాహిర్ క్యారెక్టర్..
నాగార్జున విలనిజం ఇవన్నీ అభిమానులకు కిక్ ఇస్తాయి..
రజినీ దేవాగా రప్ఫాడించాడు.. ఆయన స్టైల్ పీక్స్ అంతే.. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా..
నాగార్జున తనవరకు 1000 శాతం ట్రై చేసాడు.. కానీ మనకే మన నాగ్ మంచోడు అనిపిస్తుంది..
సౌబిన్ షాహిర్ సర్‌ప్రైజింగ్.. శృతి హాసన్, ఉపేంద్ర ఓకే..
అమీర్ ఖాన్ అయితే పూర్తిగా రోలెక్స్‌కు కాపీ..
లోకేష్ కనకరాజ్ స్టార్స్ మీద కాకుండా స్టోరీపై కూర్చుని ఉంటే బాగుండేది..
అనిరుధ్ మరోసారి శక్తివంచన లేకుండా సినిమాను కాపాడాడు..
ఓవరాల్‌గా కూలీ.. స్టోరీ తక్కువ.. స్టైల్ ఎక్కువ.. ఇది సోషల్ మీడియాలో కూలి చూసిన వారు మాట్లాడుతున్న మాటలు.